స్పెర్మ్ కౌంట్‌ని అధికరించడానికి మరియు పురుషులలో సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి గల సహజ మార్గాలు

Dr. Prachi Benara
Dr. Prachi Benara

MBBS (Gold Medalist), MS (OBG), DNB (OBG) PG Diploma in Reproductive and Sexual health

16+ Years of experience
స్పెర్మ్ కౌంట్‌ని అధికరించడానికి మరియు పురుషులలో సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి గల సహజ మార్గాలు

మీరు తక్కువ స్పెర్మ్ కౌంట్ కారణంగా ఆందోళన చెందుతున్నట్లయితే, ఇది చివరి దాస కాదని మీరు గుర్తుంచుకోవడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైన స్పెర్మ్ కౌంట్ అన్నది పురుషుల సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఇది గుడ్డు ఫలదీకరణ యొక్క సంభావ్యతను అధికరిస్తుంది. మీ స్పెర్మ్ కౌంట్ సగటు విలువ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, స్పెర్మ్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి మరియు సంతానోత్పత్తిని అధికరించడానికి సహజ మార్గాలు ఉన్నాయి. నిజానికి, దాదాపు 15% దంపతులు వంద్యత్వం వల్ల బాధపడుతున్నారు మరియు ఇందులో 50% కేసులకు కారణం పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటమే. శుభవార్త ఏమిటంటే, జీవనశైలిలో మార్పులు మరియు వైద్య సలహాలతో, ఎంతో మంది పురుషులు తమ స్పెర్మ్ యొక్క నాణ్యత అధికరించడం మరియు గర్భధారణ అవకాశాలు గణనీయంగా మెరుగుపడటం గమనిస్తున్నారు. ఈ ఆర్టికల్‌లో, స్పెర్మ్ యొక్క కౌంట్ మరియు మందాన్ని సహజంగా పెంచడానికి సహాయపడే కొన్ని సాక్ష్య-ఆధారాలతో కూడిన విధానాలను చూద్దాం.

స్పెర్మ్ కౌంట్‌ గురించి తెలుసుకుందాం

స్పెర్మ్ కౌంట్‌ను అధికరించే మార్గాల గురించి చూసే ముందు, సాధారణ స్పెర్మ్ కౌంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబల్యూహెచ్ఓ) ప్రకారం, సాధారణ స్పెర్మ్ కౌంట్ అంటే ప్రతి మిల్లీలీటర్ స్పెర్మ్‌లో కనీసం 15 నుండి 200 మిలియన్ల వరకు స్పెర్మ్‌లు ఉండాలి. ఇంతకంటే తక్కువ కౌంట్ ఉన్నట్లయితే అది తక్కువగా ఉన్నట్లు పరిగణించబడుతుంది మరియు ఒలిగోస్పెర్మియాగా నిర్ధారణ చేయబడవచ్చు.

గర్భధారణ కోసం ఉండాల్సిన సాధారణ స్పెర్మ్ కౌంట్

విజయవంతంగా గర్భం దాల్చడానికి, సాధారణంగా ఒక మిల్లీలీటర్‌లో కనీసం 15 మిలియన్ల స్పెర్మ్ కౌంట్ ఉండాలి. అంతకంటే ఎక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్నట్లయితే గర్భధారణ అవకాశాలు అధికంగా ఉంటాయి, అయితే తక్కువ కౌంట్ ఉన్నా కూడా గర్భం సాధ్యమవుతుందని గమనించడం ఎంతో ముఖ్యం, బహుసా సంభావ్యత తక్కువగా ఉండవచ్చు.

తక్కువ స్పెర్మ్ కౌంట్ యొక్క సంకేతాలు

తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్నట్లు (వైద్యపరంగా ఒలిగోస్పెర్మియా అని పిలుస్తారు) సూచించే కొన్ని సంకేతాలు ఇవి:

ఒకవేళ మీరు ఈ సంకేతాలలో దేనినైనా గమనించినట్లయితే, మీకు తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉందో లేదో తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించండి.

తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉండటానికి గల కారణాలు

సమర్థవంతమైన చికిత్స పొందాలంటే తక్కువ స్పెర్మ్ కౌంట్ యొక్క కారణాలను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. ఈ పరిస్థితికి అనేక అంశాలు దోహదపడతాయి:

  1. హార్మోన్ల అసమతుల్యత: హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంధి లేదా వృషణాలలో సమస్యలు కూడా స్పెర్మ్ ఉత్పత్తికి కావాల్సిన హార్మోన్‌ల స్థాయులను ప్రభావితం చేయవచ్చు.
  2. జన్యుపరమైన కారకాలు: క్రోమోజోమ్ అసాధారణత కూడా వృషణాల పనితీరును ప్రభావితం చేస్తుంది మరియు ఇది తక్కువ స్పెర్మ్ ఉత్పత్తికి దారితీస్తుంది.
  3. వైద్య పరిస్థితులు: మధుమేహం, సిస్టిక్ ఫైబ్రోసిస్ లేదా గవదబిళ్లలు వంటి సంక్రమణాలు కూడా సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి.
  4. పర్యావరణ కారకాలు: పురుగుమందులు, భారీ లోహాలు మరియు రేడియేషన్ వంటి విషపూరిత వాతావరణానికి గురికావడం కూడా స్పెర్మ్ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
  5. జీవనశైలి విధానాలు:
    • ఊబకాయం: అధిక శరీర బరువు హార్మోన్లను ప్రభావితం చేస్తుంది, ఇది స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
    • ధూమపానం: పొగాకు స్పెర్మ్ కౌంట్ మరియు నాణ్యతకు ముడిపడి ఉంటుంది మరియు దీనిని తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ మరియు నాణ్యత రెండూ తగ్గుతాయి.
    • మద్యం మరియు మాదక ద్రవ్యాల వినియోగం: మద్యపానం మరియు గంజాయి మరియు అనాబాలిక్ స్టెరాయిడ్స్ వంటి వినోద ఔషధాలను అధికంగా వినియోగించడం ద్వారా అది సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
    • వేడి వాతావరణంలో ఉండటం: తరచుగా ఆవిరి స్నానాలు, వేడినీటి స్నానాలు లేదా బిగుతుగా ఉండే లోదుస్తులను ధరించడం వల్ల స్క్రోటల్ ఉష్ణోగ్రత అధికరించి స్పెర్మ్ ఉత్పత్తి దెబ్బతింటుంది.
  6. వయస్సు: పురుషులు వృద్ధాప్యంలో కూడా ఫలవంతంగా ఉండగలరు, కానీ సాధారణంగా 40 ఏళ్ల తర్వాత టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి, కనుక ఇది స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

స్పెర్మ్ కౌంట్‌ని అధికరించే సహజ మార్గాలు

మీరు సహజంగా స్పెర్మ్ కౌంట్‌ని అధికరించుకోడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి:

  1. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి:
    సాచ్యురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ (ఎస్ఎఫ్ఏ) మరియు పాలీఅన్‌సాచ్యురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ (పియుఎఫ్ఏ) లేదా అసమతుల్యమైన ఒమేగా-6/ఒమేగా-3 పియుఎఫ్ఏ నిష్పత్తి గల ఆహారాలను నివారించండి, ఎందుకంటే అవి స్పెర్మ్ నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. దానికి బదులుగా, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారాలను తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకోండి, ఎందుకంటే ఇది స్పెర్మ్ ఆరోగ్యం మరియు నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ప్రయోజనకరమైన కొన్ని ఆహారాలు ఇవి:

    • పండ్లు మరియు కూరగాయలు: బెర్రీలు, బచ్చలికూర మరియు బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
    • గింజలు మరియు విత్తనాలు: వాల్‌నట్‌లు మరియు గుమ్మడికాయ గింజలు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్‌ని అందిస్తాయి.
    • లీన్ ప్రోటీన్‌లు: సాల్మన్ వంటి చేపలు మరియు చికెన్  పూర్తి ఆరోగ్యానికి తోడ్పడతాయి.
  2. సప్లిమెంట్లను తీసుకోండి:
    ముఖ్యంగా పోషకాహార లోపం ఉన్న పురుషులకు జింక్, విటమిన్లు మరియు కోఎంజైమ్ Q10 వంటి కొన్ని సప్లిమెంట్లు స్పెర్మ్ నాణ్యత మరియు కౌంట్‌ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
  3. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి:
    మితమైన లేదా తీవ్రమైన శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించగలరు మరియు ఇది స్పెర్మ్ ఉత్పత్తికి కీలకమైన టెస్టోస్టెరాన్ స్థాయులను అధికరించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, తీవ్రమైన శారీరక శ్రమ కారణంగా స్పెర్మ్ చలనశీలత (వీర్యకణాలు ముందుకు కదిలే సామర్థ్యం), మోర్ఫాలజీ (వీర్యకణాల యొక్క భౌతిక రూపం మరియు ఆకృతి), మరియు ఏకాగ్రత (మిల్లిలీటర్‌లో స్పెర్మ్ కణాల సంఖ్య) ప్రతికూలంగా ప్రభావితం కాగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి. కనుక మితమైన శారీరక శ్రమ కీలకమైన అంశం.
  4. ఒత్తిడిని నిర్వహించండి:
    అధిక ఒత్తిడి స్థాయులు ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయి మరియు ఇది స్పెర్మ్ అభివృద్ధికి అవసరమైన హార్మోన్‌ల ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ధ్యానం, యోగా లేదా లోతైన శ్వాస వ్యాయామాలు వంటి పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి మరియు సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి.
  5. హానికరమైన పదార్ధాలను నివారించండి:
    ధూమపానం మానేయడం మరియు మద్యపానం తీసుకోవడాన్ని పరిమితం చేయడం ద్వారా స్పెర్మ్ యొక్క నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ రెండు పదార్థాలు స్పెర్మ్ కౌంట్ తగ్గడం మరియు చలనశీలతను ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా, గంజాయి మరియు అనాబాలిక్ స్టెరాయిడ్స్ వంటి వినోద ఔషధాలను నివారించండి.
  6. తగినంత నిద్ర పొందండి:
    మొత్తం ఆరోగ్యం మరియు హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇవ్వడానికి రాత్రి వేళలో 7-8 గంటల వరకు మంచి నాణ్యమైన నిద్రను పొందడం లక్ష్యంగా పెట్టుకోండి. పేలవమైన నిద్ర కారణంగా టెస్టోస్టెరాన్ స్థాయులు దెబ్బతింటాయి మరియు అది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
  7. వేడికి బహిర్గతం అవ్వడం పరిమితం చేసుకోండి:
    అధిక వేడి కారణంగా స్క్రోటల్ ఉష్ణోగ్రత అధికరిస్తుంది మరియు ఇది స్పెర్మ్ ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కనుక, ఎక్కువ సమయం వేడి స్నానాలు లేదా ఆవిరి స్నానాలను చేయడం నివారించండి. అదనంగా, ఎక్కువసేపు వేడికి గురి కాకుండా ఉండటానికి ల్యాప్‌టాప్‌లు లేదా సెల్ ఫోన్‌లను మీ ఒడిలో ఉంచుకోవద్దు.
  8. వదులుగా ఉండే, గాలి ప్రసురించే రకమైన లోదుస్తులను ధరించండి:

శరీర ఉష్ణోగ్రత కంటే 2°C తక్కువగా ఉండే ఉష్ణోగ్రత వద్దనే వృషణాలు సరిగ్గా పనిచేస్తాయి. బిగుతుగా ఉండే లోదుస్తులు మరియు ప్యాంటులు స్క్రోటల్ ఉష్ణోగ్రతను అధికరిస్తాయి మరియు ఇది స్పెర్మ్ మరియు టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కనుక, స్పెర్మ్ ఆరోగ్యానికి సరైన ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడే వదులుగా, గాలి ప్రసరణ ఉండేటువంటి అనుకూలమైన బట్టలను ఎంచుకోండి.

  1. పర్యావరణ విషపదార్ధాలకు గురికావడం పరిమితం చేయండి:

పురుగుమందులు, ప్లాస్టిక్‌లు మరియు శుభ్రపరచే ఉత్పత్తులలో కనిపించే కొన్ని రసాయనాలు మరియు విషాలు స్పెర్మ్ నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. సేంద్రీయ ఉత్పత్తులను ఎంచుకోవడం, సహజ శుభ్రపరచే ఉత్పత్తులను ఉపయోగించడం మరియు ప్లాస్టిక్ కంటైనర్‌లను నివారించడం ద్వారా వాటికి మీరు బహిరంగం కావడాన్ని తగ్గించండి.

  1. అంతర్లీన ఆరోగ్య పరిస్థితులను నిర్వహించండి:

వరికోసెల్ (స్క్రోటమ్‌లో విస్తరించిన సిరలు), సంక్రమణాలు లేదా హార్మోన్ల అసమతుల్యత వంటి కొన్ని వైద్య పరిస్థితులు తక్కువ స్పెర్మ్ కౌంట్‌కు దోహదపడతాయి. ఏదైనా అంతర్లీన సమస్య ఉందని మీరు అనుమానించినట్లయితే, సమస్యను నిర్ధారించడంలో మరియు చికిత్స చేయడంలో సహాయపడే ఎవరైనా ఒక సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించండి.

స్పెర్మ్ యొక్క మందాన్ని మెరుగుపరచడం ఎలా?

స్పెర్మ్ యొక్క మందాన్ని మెరుగుపరచడానికి, హైడ్రేషన్ మరియు పోషణపై దృష్టి పెట్టండి. బాగా హైడ్రేటెడ్‌గా ఉండే శరీరం మెరుగైన నాణ్యమైన వీర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, జింక్ (గుల్లలు వంటివి) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వీర్యం యొక్క మందం అధికరిస్తుంది.

ఒక్క రాత్రిలో స్పెర్మ్ వాల్యూమ్‌ను పెంచడం ఎలా?

ఒక్క రాత్రిలో గణనీయమైన మార్పులు అసంభవం అయినప్పటికీ, మీరు స్ఖలనానికి ముందు హైడ్రేటెడ్‌గా ఉండటం మరియు మీరు స్పెర్మ్ మూల్యాంకనం కోసం వెళుతున్నట్లయితే దాని పనితీరును దెబ్బతీసే మద్యం లేదా  మాదక ద్రవ్యాలను నివారించడం ద్వారా పరిస్థితులను అనుకూలీకరించవచ్చు. అందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి:

  • ముందు రోజు పుష్కలంగా నీరు త్రాగాలి.
  • మందగింపుకు కారణమయ్యే భారీ భోజనం చేయవద్దు.
  • సరైన శరీర పనితీరును నిర్ధారించడానికి తగినంత విశ్రాంతి తీసుకోండి.

స్పెర్మ్ యొక్క నాణ్యతను మెరుగుపరచడం ఎలా?

స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడానికి:

  • అవసరమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోండి.
  • వదులుగా ఉండే లోదుస్తులను ధరించడం ద్వారా వృషణాలు వేడెక్కకుండా నివారించండి.

పర్యావరణ విషపదార్థాలకు గురికావడాన్ని పరిమితం చేయండి (ఉదా., పురుగుమందులు).

స్పెర్మ్ ఆరోగ్యంపై ఆహారం యొక్క ప్రభావం

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే పురుషులలో స్పెర్మ్ కౌంట్ 50% వరకు అధికరిస్తుందని మీకు తెలుసా? సాల్మన్, వాల్‌నట్‌లు మరియు అవిసె గింజలు వంటి ఆహారాలు ఒమేగా-3ల యొక్క అద్భుతమైన మూల పదార్థాలు, ఇవి రక్త ప్రవాహాన్ని మరియు హార్మోన్ స్థాయులను మెరుగుపరుస్తాయి, తద్వారా స్పెర్మ్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి.

సరైన స్పెర్మ్ ఉత్పత్తి కోసం ఒక అద్భుత చిట్కా

జింక్ కీలక పదార్ధం: టెస్టోస్టెరాన్ ఉత్పత్తి మరియు మొత్తం పునరుత్పత్తి ఆరోగ్యంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. పురుషులు రోజుకు కనీసం 11 మి.గ్రా జింక్‌ని తీసుకోవాలి. గుల్లలు, గుమ్మడి గింజలు మరియు కాయ ధాన్యాలు జింక్ అధికంగా ఉండే ఆహారాలు. వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా స్పెర్మ్ నాణ్యత మరియు పరిమాణం రెండూ గణనీయంగా అధికరిస్తాయి.

నీరు తాగడం వల్ల స్పెర్మ్ కౌంట్ అధికరిస్తుందా?

నీరు త్రాగడం వల్ల స్పెర్మ్ కౌంట్ అధికరిస్తుందని తెలిపే ప్రత్యక్ష సాక్ష్యం లేనప్పటికీ, పునరుత్పత్తి వ్యవస్థ యొక్క ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యానికి సరైన ఆర్ద్రీకరణ అవసరం. రోజంతా నీరు త్రాగడం ద్వారా బాగా హైడ్రేటెడ్ గా ఉండటం మరియు చక్కెర పానీయాలను నివారించడం సరైన స్పెర్మ్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

జీరో స్పెర్మ్ కౌంట్: అధికరించడం ఎలా

జీరో స్పెర్మ్ కౌంట్ (అజోస్పెర్మియా) అనేది వైద్య మూల్యాంకనం అవసరమయ్యే ఒక తీవ్రమైన పరిస్థితి. ఇందుకు తగ్గ చికిత్స ఎంపికలు:

  • హార్మోన్ల చికిత్స
  • శరీర నిర్మాణ సంబంధమైన సమస్యలను సరిచేయడానికి శస్త్రచికిత్స
  • ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసిఎస్ఐ)తో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) వంటి సహాయక పునరుత్పత్తి సాంకేతికతలు

వ్యక్తిగతీకరించిన చికిత్సా ఎంపికల కోసం పురుషుల సంతానోత్పత్తిలో రాణించిన ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించడం ఎంతో అవసరం.

ముగింపు

స్పెర్మ్ కౌంట్ మరియు నాణ్యతను మెరుగుపరచడం అనేది ఆహార మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడి నిర్వహణ మరియు హానికరమైన పదార్ధాలను నివారించడం వంటి సమగ్ర విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా, మీరు ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తికి మద్దతు ఇవ్వవచ్చు మరియు మీ మొత్తం సంతానోత్పత్తిని మెరుగుపరచవచ్చు.

గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు అవ్వాలన్న ప్రతి ఒక్కరి జీవన ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. సరైన జ్ఞానం మరియు మద్దతుతో, మీరు మీ సంతానోత్పత్తిని మెరుగుపరచుకోవడానికి మరియు మీ గర్భధారణ అవకాశాలను అధికరించుకోడానికి చురుకైన చర్యలు తీసుకోవచ్చు.

మా వైద్యుడి నుండి ఒక మాట

మీరు సంతానోత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు మానసికంగా పొంగిపోవడం మరియు ఆందోళన చెందడం సహజం. కానీ ఇటువంటి ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదని గుర్తుంచుకోండి. చాలా మంది పురుషులు దీనిని అనుభవిస్తారు మరియు ఇందుకు మద్దతు అందుబాటులో ఉంది. మీ వైద్యుడు, సంతానోత్పత్తి నిపుణులు లేదా కౌన్సెలర్‌తో మాట్లాడండి. మీరు మీకు గల ఎంపికలను అర్థం చేసుకోవడంలో మరియు ఈ కష్ట సమయాన్ని దాటడంలో వారు మీకు సహాయపడగలరు. ~ దీపికా మిశ్రా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

-->

Our Fertility Specialists

Related Blogs